Kurchi Madathapetti: ప్రపంచాన్ని.. ‘కుర్చీ మడత’ పెట్టిస్తోంది

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన చిత్రం గుంటూరు కారం. అయితే ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరం అవుతున్నా దాని హంగామా ఇంకా సాగుతూనే ఉంది. ముఖ్యంగా మహేశ్‌బాబు, శ్రీలీలపై చిత్రీకరించిన కుర్చీ మడత పెట్టి (Kurchi Madathapetti) సాంగ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది తప్పితే.. ఎక్కడా తగ్గడం లేదు.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం తోడవడంతో ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన నాటి నుంచి హద్దుల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతూనే ఉంది. దీంతో 2024 సంవత్సరానికి గానూ యూ ట్యూబ్ మ్యూజిక్ గ్లోబల్ టాప్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచి ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని రికార్డు సృష్టించింది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాట్లో అన్ని విదేశాల సాంగ్స్ ఉండగా ఇండియా నుంచి అది కూడా తెలుగు సినిమా నుంచి ఈ పాట మాత్రమే చోటు సంపాదించుకుంది. ఇప్పటివరకు 528 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. మహేష్ బాబు, శ్రీలీల జంటస్టెప్పులు ఇతర దేశాల ప్రజలను కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. గతంలో ధనుష్ మారి మూవీలోని రౌడీ బేబీ సాంగ్ ఈ ఘనత దక్కించుకుంది.