Vikram Misri: పాక్‌ పుట్టుకతోనే అబద్దాలు పుట్టాయి.. త‌ప్పుడు స‌మాచారం వైర‌ల్ చేస్తున్నారు

  • By: sr    news    May 08, 2025 8:53 PM IST
Vikram Misri: పాక్‌ పుట్టుకతోనే అబద్దాలు పుట్టాయి.. త‌ప్పుడు స‌మాచారం వైర‌ల్ చేస్తున్నారు

Vikram Misri:

విధాత, న్యూఢిల్లీ: పహల్గాంలో పాక్‌ ఉగ్రమూకల దాడితో పాకిస్తాన్ ముందుగా ఉద్రిక్తతలకు తెరలేపిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మిస్రీ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోందని ఆరోపించారు. నిన్న భారత్ దాడిలో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ అధికారిక లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించిందని.. ఉగ్రవాదులకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్తాన్‌లో ఒక ఆచారం కావచ్చని మిస్త్రీ చురకలేశారు.

ఇంతకంటే పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు నిదర్శనం ఏం కావాలన్నారు. పాక్ ఉగ్రవాదుల అడ్డగా మారిపోయిందని..పహల్గామ్ దాడికి కారణం తమదేనని టీఆర్ ఎఫ్ ప్రకటించుకుందని, టీఆర్ఎఫ్ ఐరాస నిషేదిస్తామంటూ పాక్ అడ్డుపడిందన్నారు. పాకిస్తాన్ మిలటరీ చీఫ్ మాటలకు..చేతలకు పొంతన లేదని మిస్రీ మండిపడ్డారు. ఉగ్రవాదానికి మతం రంగు పూస్తున్నారన్నారు. పూంచ్ సెక్టార్ లో సిక్కు పౌరులపై కాల్పులు జరిపి ముగ్గరు చావుకు కారణమైందన్నారు. ప్రార్ధనా మందిరాలను మేం టార్గెట్ చేయలేదన్నారు. పాక్ చర్యల వల్లనే సింధూ జలాల ఒప్పందం రద్దు చేశామన్నారు. పాక్ పుట్టుకతోనే అబద్దాలు పుట్టాయని, 65ఏళ్లుగా భారత్ పై విషం కక్కుతునే ఉందన్నారు. ప్రపంచ దేశాలతో ప్రధాని మోదీ మాట్లాడుతుున్నారని..అంతా మద్దతునిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం భారత్ చేస్తున్న దాడులు కేవలం ప్రతిదాడులు మాత్రమేనన్నారు.

కర్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇదివరకే స్పష్టం చేశామని తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని వెల్లడించారు. అయితే భారత సైన్యం పాక్ బలగాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని వివరించారు.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయులు పౌరులు మృతి చెందారని..మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. నిన్నటి నుంచి కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెందార్, రాజౌరీ సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడుతోందన్నారు. పాకిస్థాన్ కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందన్నారు.

పాక్ లో దాడులపై భారత్ కీలక ప్రకటన

పాక్ లోని 9 ప్రాంతాల్లో దాడిపై భారత ప్రభుత్వ అధికారిక ప్రకటన చేసింది. పాక్ ఏ స్థాయిలో దాడికి ప్రయత్నించిందో అదే స్థాయిలో ప్రతిదాడి చేశామని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోందని గుర్తు చేసింది. పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే ఈసారి తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి, చోర్ సహా తొమ్మిడి భారత్ డ్రోన్ లతో దాడులు నిర్వహించింది. రూ.1600 కోట్ల పాక్ ఆస్తులు ధ్వంసం చేసినట్లుగా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసినట్లుగా భారత్ ఆర్మీ ప్రకటించింది.