Mahabubabad | కాసేపట్లో రిసెప్షన్.. విద్యుత్ షాక్ తో పెళ్లికొడుకు మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం

Mahabubabad | మహబూబాబాద్ , విధాతః మహబూబాబాద్ జిల్లా కోడిపుంజుల తండాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. కాసేపట్లో రిసెప్షన్ జరుపుకోవాల్సిన పెళ్లి కొడుకు విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ బాలు చిన్న కుమారుడు ఇస్లావత్ నరేష్ వివాహం సోమవారం విజయవాడలోని కంకిపాడులో ఘనంగా జరిగింది.
మంగళవారం వరుడి ఇంట్లో రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుడు మోటర్ పంప్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. పెళ్లి కొడుకు మృతి చెందడంతో అతని తల్లి, తండ్రి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనను చూసిన నూతన వధువు స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!