పరువునష్టం కేసు.. మేధా పాట్కర్ అరెస్టు

  • By: sr    news    Apr 25, 2025 7:21 PM IST
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్ అరెస్టు

విధాత: ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం పాట్కర్ కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈక్రమంలోనే శుక్రవారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. నర్మదా బచావో ఆందోళన్‌ సందర్భంగా వీకే సక్సేనాపై పాట్కర్ కేసు వేశారు. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ పాట్కర్ పై సక్సేనా కూడా రెండు కేసులు దాఖలు చేశారు.