NAREGA | ఉపాధి హామీ కోసం.. ‘ఉత్తర యుద్ధం: నర్సంపేటలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన కక్ష్య కట్టింది ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచాలి MGNREGS పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలి నర్సంపేటలో ప్రారంభించిన "ఉత్తర యుద్ధం" విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి హామీ పథకాన్ని ( NAREGA ) వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రికి "ఉత్తర యుద్ధం" పేరుతో ఉత్తరాలు పంపే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు […]

- కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన కక్ష్య కట్టింది
- ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచాలి
- MGNREGS పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలి
- నర్సంపేటలో ప్రారంభించిన “ఉత్తర యుద్ధం”
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి హామీ పథకాన్ని ( NAREGA ) వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రికి “ఉత్తర యుద్ధం” పేరుతో ఉత్తరాలు పంపే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోంది. గత ఏడాది 30 వేల కోట్ల బడ్జెట్ కోత విధించారు. దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయని మంత్రి అన్నారు. కేంద్రం ద్వారా రావాల్సిన నిధులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రభుత్వ సంస్థలన్నిటిని అమ్మేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీస్తున్న మోడీకి రైతులు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు.
ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టద్దు
పంట స్థాయిని బట్టి ఎకరానికి కూలీ టోకెన్లు, మస్టర్ లో 100 పని దినాలు వుండే విధంగా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలికి రోజుకు 257/- ఇవ్వాలని చట్టం ఉన్నప్పుటికీ ఏ ఒక్క కూలికి 100/- లకు మించడం లేదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గం.లు పని చేసిన కూలికి 480/- ఇవ్వాలని ఉన్నప్పటికి ఉపాధి హామి కూలీలకు మాత్రం కనీస కూలీ అందటం లేదని, సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతలతో కూలీలుగా వారే ఉంటున్నారు, కాబట్టి వ్యవసాయాన్ని అనుసందానం చేయటం వల్ల రైతులకు, కూలీలకు గిట్టుబాటు అవుతుందన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
రూ.4.కోట్ల 41 లక్షలతో వెంకటాపురం నుండి మహ్మదాపురం మీదుగా నర్సంపేట మండలం రాజేశ్వరావుపల్లి గ్రామం వరకు బిటి రోడ్డు పనులకు, రూ. కోటి.20 లక్షలతో మహ్మదాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్, ఎంపిపి, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ఎంపిటిసి, సర్పంచ్, PACS చైర్మన్లు, ఇతర ప్రజప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, తదితరులు పాల్గొన్నారు.