డాక్యుమెంటరీగా.. రాయలసీమ ‘దేవర పండుగ’
. ‘పొద్దుటూరు దసరా’ తర్వాత అదే భావోద్వేగంతో రూపొందిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ, గ్రామీణ జీవితాన్ని, దేవర జాతర విశిష్టతను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ తెరకెక్కించిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ ప్రీమియర్ షో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. గతంలో ‘పొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ, ఈసారి నవాబుపేటలో జరిగే దేవర జాతరను డాక్యుమెంటరీగా ఆవిష్కరించారు. బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదర్శన అనంతరం మాట్లాడిన నటుడు మహేశ్ విట్టా, రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను నిజంగా చూపించే ప్రయత్నమిదని అన్నారు. మురళీ చేసిన డాక్యుమెంటరీలు నచ్చాయని, రాయలసీమ నేపథ్యంతో ఆయన ఫీచర్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రొడ్యూసర్ శివప్రసాద్ మాట్లాడుతూ దేవర పండుగను చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగానని, ఆ అనుభూతిని డాక్యుమెంటరీగా చూపించాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని చెప్పారు. రెండు రోజుల జాతరలో మురళీ చేసిన కష్టం అపూర్వమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరో డాక్యుమెంటరీని కూడా రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ పూజ కృష్ణ తుమ్మ మాట్లాడుతూ ఈ డాక్యుమెంటరీ ఫలితం తనను సంతృప్తి పరిచిందన్నారు. సంప్రదాయ ఆచారాలను ఎలాంటి మార్పులు లేకుండా చూపించారని చెప్పారు. టీమ్ మరిన్ని ఇలాంటి ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షించారు.
నవాబుపేట సర్పంచ్ పాతకోట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘పొద్దుటూరు దసరా’ కంటే కూడా ‘నవాబుపేట దేవర’ మరింత ఆకట్టుకుందని అభిప్రాయపడ్డారు. సంగీతం, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. టీమ్ సపోర్ట్‌తోనే ఈ డాక్యుమెంటరీని తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామని చెప్పారు. విజువల్స్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram