Meera Raj: టాలీవుడ్‌కు.. మ‌రో ఉత్తరాది భామ

సన్ ఆఫ్’ సినిమాతో మ‌రో ఉత్తరాది భామ మీరా రాజ్ టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది,

  • By: raj |    movies |    Published on : Dec 21, 2025 9:04 PM IST
Meera Raj: టాలీవుడ్‌కు.. మ‌రో ఉత్తరాది భామ

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల రాక‌డ పోక‌డ నిత్యం ఆప్ర‌తిహాతంగా కొన‌సాగుతూ ఉంటుంది. ప్ర‌తి ఆరు నెల‌లో ఓ కొత్త ముఖం ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటుంది. అయితే, ఆ గ్లామర్‌ను మించి నిలకడగా కెరీర్ కొనసాగించగలిగేవారు మాత్రం కొద్దిమందే ఉంటారు. మరోవైపు, కథకు సరిపోయే కొత్త అమ్మాయిల కోసం దర్శక–నిర్మాతలు నిరంతరం అన్వేషణలోనే ఉంటారు.

ఈ కోవ‌లోనే ‘సన్ ఆఫ్’ సినిమాతో ఓ ఉత్తరాది యువతి టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆమె పేరు మీరా రాజ్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ప్రారంభ‌మైంది. ఇదిలాఉంటే ఈ భామ ఇటీవ‌ల‌ కోలీవుడ్‌లో రూపొందుతున్న రాఘవ లారెన్స్ దర్శకత్వంలోని ‘కాంచన 4’లో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లు లీడ్ రోల్స్ లో న‌టిస్తుండ‌డం విశేషం. చూడాలి మ‌రి ఈ అమ్మ‌డి భ‌విత‌వ్యం మున్ముందు ఎలా ఉండ‌నుందో.