కేసీఆర్ లక్ష్యంగా.. NDSA రిపోర్టు: జగదీష్ రెడ్డి
విధాత: మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్లపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఎన్డీఏ రిపోర్ట్ అని..కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్ ను దెబ్బకొట్టే లక్ష్యంతో ఇచ్చిన నివేదిక అని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి రిపోర్టే ఇచ్చారని.. ఎన్డీఎస్ఏ నివేదిక పనిమాలిందని..చెత్తబుట్టలో వేసేందుకు తప్ప..ఎందుకు పనికిరాదన్నారు. బడే భాయ్, చోటే భాయ్ నాటకంలో భాగంగా ఈ రిపోర్ట్ ఇచ్చారని..ఎన్డీఎస్ఏ నివేదికను బీఆర్ఎస్ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గుజరాత్‌లో నిర్మాణం కాకముందే కూలి 150 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ అక్కడకు ఎందుకు పోదని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కాళేశ్వరం కోసమేనా ఎన్డీఎస్ఏను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ కుట్రలను అర్థం చేసుకోనంత అమాయకులు కారన్నారు.
వరంగల్ సభకు జన జాతర
ఈ నెల 27 న పార్టీ రజతోత్సవ సభకు వరంగల్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయని..రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా ఎల్కతుర్తికి సజావుగా చేరుకునేట్టు ఏర్పాట్లు చేశామన్నారు. కేసీఆర్ ప్రతి రోజూ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. కాంగ్రెస్ వ్యతిరేక సభగా ప్రజలు భావించి స్వచ్చంధంగా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలు కసితో ఉన్నారని..ఇది పార్టీ సభ కన్నా ఎక్కువ తమ సొంత సభగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏ పార్టీ సభకు ఇంత ఆదరణ వ్యక్తం కాలేదన్నారు. మా సభలు గతంలో ఎన్నో విజయవంతం అయ్యాయని.. మా సభ రికార్డులు మేమే బద్దలుకొట్టామని తెలిపారు. ఎల్కతుర్తి మట్టిని ముట్టుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. వృద్దులు కూడా సభకు రావాలనే ఉత్సాహంలో ఉన్నప్పటికి ఎండల దృష్ట్యా మేమే వారిని వారిస్తున్నామని తెలిపారు. రైతులు, మహిళలు, యువతలో ఉత్సాహంగా సభకు సిద్ధమవుతున్నారన్నారు. సభకు జాతరలా ప్రజలు కదులుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ రజతోత్సవమా అన్న చర్చ అనవసరమని స్పష్టం చేశారు.గులాబీ జెండా, కేసీఆర్‌లనే ప్రజలు చూస్తున్నారన్నారు. సమ్మక్క సారక్క జాతరను తలపించేలా రజతోత్సవ సభ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram