Telangana CMO | లండన్‌లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి.. స్పందించిన CMO
Telangana CMO |
హైదరాబాద్, ఏప్రిల్ 28(విధాత): నిజామాబాద్ జిల్లాకు చెందిన నల్ల అనురాగ్ రెడ్డి లండన్ లో తప్పి పోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అనురాగ్ తల్లి హరిత తను బిడ్డ జాడ వెతికి తెలుసుకొని ఇండియాకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సోమవారం వినతిపత్రం పంపారు. వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ కు వెళ్ళాడు. యూకే లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రం లో తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram