Karimnagar: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రైవేటు పాటలతో చిందులు

Karimnagar
విధాత : పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రైవేటు పాటలకు టీఎన్జీవో నేతలు చిందులేసిన ఘటన వైరల్ గా మారింది. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో కోలాట మహిళా బృందాలు కొద్దిసేపు భక్తి పాటలకు స్టెప్పులేశారు.
ఇంతలో ప్రైవేటు పాటలు సైతం ప్లే అవ్వగా..అలాంటి పాటలను వద్ధని చెప్పాల్సిన ఆలయ కమిటీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఉద్యోగ సంఘాల నాయకులు ఉత్సాహంగా ఆ పాటలకు చిందులేశారు. ఆదర్శనీయంగా ఉండాల్సిన నేతలే ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రైవేటు పాటలకు చిందులేయడం ఏమిటంటూ భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. మరోవైపు శ్రీవారి ఆలయం 46వ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ధ సంఖ్యలో స్వామివారి కల్యాణోత్సవంకు హాజరై స్వామి అమ్మవార్ల కల్యాణ వేడుకను తిలకించి పులకించారు.