విశ్వసనీయతకు గౌరవం.. TGRSA రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు

వరంగల్ జిల్లా, ఖిల్లా వరంగల్ మండల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కొమాండ్ల రాజు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టి.జి.ఆర్.ఎస్.ఏ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. టి.జి.ఈ. జే.ఏ.సీ చైర్మన్, టి.జి.డి.సి.ఏ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆశీర్వాదంతో టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రామ్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా కోమాండ్ల రాజు మాట్లాడుతూ..తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు టి.జి.ఈ.జే.ఏ.సీ చైర్మన్, టి.జి.డి.సి.ఏ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి కి, టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రామ్ రెడ్డి కి, టి.జి.టి. ఏ వరంగల్ అధ్యక్షులు ఇక్బాల్ గారికి,అసోసియేట్ ప్రెసిడెంట్ బండి నాగేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రామ్ రెడ్డి సహకారంతో, పూర్వ వీ.ఆర్.ఏలను, వీ.ఆర్.ఓలను తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడంతో పాటు ప్రతి రెవెన్యూ అధికారికి వారి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇప్పించేందుకు కృషి చేస్తానని.. అలానే, ప్రతి జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తానని తెలిపారు. కొమాండ్ల రాజును టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు.. పూర్వ వీ.ఆర్.ఏలు, లచ్చి రెడ్డికి, బాణాల రామ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
విశ్వసనీయతకు పట్టం
టి.జి.ఈ.జే.ఏ.సీ చైర్మన్, టి.జి.డి.సి.ఏ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డితోనే 2013 నుండి నేటి వరకు ప్రయాణిస్తున్న కొమాండ్ల రాజు. ఆయన అప్పజెప్పిన ప్రతి పనిని నూటికి నూరు శాతం అమలు చేసి శభాష్ అనిపించుకోవడంతో పాటు ప్రధాన అనుచరుడిగా రాజు ముద్ర వేసుకోగలిగాడు. వీ.ఆర్.ఓ వ్యవస్థ రద్దవుతుంటే, గ్రామస్థాయిలో రెవెన్యూ ఉద్యోగి ఉండాలని గత ప్రభుత్వంలో ఉన్న ఈటల రాజేందర్ తో చర్చలు జరపడం వల్ల ఆరోగ్య మంత్రితో అనారోగ్య చర్చలు అని మంత్రిని, లచ్చిరెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేసిన గత ప్రభుత్వం. అలాంటి కష్ట సమయంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయుని లెక్క లచ్చి రెడ్డికి నమ్మిన బంటుగా వెనకడుగు వేయకుండా ఆయన వెంటే నడిచాడు. రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించేందుకు, లచ్చిరెడ్డి ప్రారంభించిన రెవెన్యూ మాస పత్రికను ఉమ్మడి పది జిల్లాల్లో తాను లచ్చిరెడ్డి కోసం ఏర్పాటు చేసిన సైన్యం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చేర్చాడు. గత ప్రభుత్వంలో పరిస్థితులు పగబట్టి పాతాళానికి తొక్కుతున్న వేళ కూడా తన వెంట నడిచిన కొమాండ్ల రాజుకు టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పజెప్పి విశ్వాసానికి తాను ఇచ్చే గౌరవం ఏంటో లచ్చిరెడ్డి. సభ్య సమాజానికి తెలిసేలా చేశాడు.
లచ్చిరెడ్డి ప్రస్థానం..
డిప్యూటి తహశీల్దారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, తన పనితనంతో ఉన్నతాధికారులను మెప్పించి తహశీల్దారుగా పదోన్నతి పొంది, తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ (TGTA) ను స్థాపించి, ఎంతో మంది డిప్యూటీ తహశీల్దారులకు, నవాబ్ తహశీల్దారులకు, తహశీల్దారులుగా పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ఆర్.డి.ఓగా పదోన్నతి పొంది, కీసర రెవెన్యు డివిజన్ పరిధిలో “మీ భూమి – మీ పత్రాలు” అనే కార్యక్రమాన్ని చేపట్టి, కేవలం ఒకే రోజులో 100కు పైగా పట్టాలు అందించిన గొప్ప నాయకుడు. తాను ఎక్కడ పని చేస్తే అక్కడ, ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పని చేస్తున్న ఎందరో వి.ఆర్.ఏలను, రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతలు కల్పించడంతో, ఈరోజు వారందరు సినియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఉన్నత స్థానంలో ఉన్నారు.
గత ప్రభుత్వం, వి.ఆర్.ఏ మరియు వి.ఆర్.ఓ ల వ్యవస్థను తీసివేయాలని నిర్ణయించినప్పుడు, రెవెన్యూ ఉద్యోగుల తరఫున ప్రభుత్వంపై పొరాడిన అలుపెరుగని నాయకుడు. ప్రభుత్వం వి.ఆర్.ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలలోకి పంపించగా, తన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 వేలకు పైగా ఉద్యోగులకు ఎంప్లాయి ఐ.డీలు మరియు జీతాలు ఇప్పించి తన సహృదయాన్ని చాటిన నాయకుడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుండి ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ, సమన్వయం చేసుకుంటూ క్రమక్రమేనా పెండింగ్ లో ఉన్న సమస్యలతో పాటు కొత్తగా ఏర్పడుతున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపేలా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్న అలుపెరుగని బాటసారి ఆయన.