Sammelanam: ఓటీటీలో.. ఆకట్టుకుంటున్న కొత్త వెబ్‌సిరీస్
Sammelanam Ott:
విధాత: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తాజాగా మరో వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ (Sammelanam) సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ మొదటి రోజు నుంచే బాగా ట్రెండ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే.. రామచంద్ర ఓ రచయిత. తన సొంత అనుభవాలతో ఓ పుస్తకం రాయగా మంచి ఆదరణ తక్కించుకోవడమే గాక రచయితగా ఫేమస్ అయి మీడియాలో ఆర్టికల్స్ సైతం వస్తాయి. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు, ప్రియురాలు రామచంద్రను కలుసుకోవాలని అనుకుంటారు. అసలు వారు ఎందుకు విడిపోయారు. రామచంద్ర ప్రేయసి గతంలో తన మిత్రుడిని ప్రేమించిందా అనే ఆసక్తికరమైన కథ కథనాలతో ఈ సిరీస్ సాగుతుంది.

ప్రియా వడ్లమాని, గణాదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించగా సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా వ్యవహరించారు. తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహఙంచాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ ఈ సిరీస్‌ను అద్భుతంగా మలచడం విశేషం. అంతేకాదు ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

ఇదిలాఉండగా.. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్ (ETV Win) లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram