Telangana: మే 15 నుంచి 26 వరకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు! వెబ్‌సైట్‌, యాప్‌ ఆవిష్కరణ

  • By: sr    news    Apr 15, 2025 7:03 PM IST
Telangana: మే 15 నుంచి 26 వరకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు! వెబ్‌సైట్‌, యాప్‌ ఆవిష్కరణ

విధాత: సరస్వతి పుష్కరాల వెబ్ సైట్, యాప్‌ లను మంగళవారం మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో మే 15 నుంచి 26 వరకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. సరస్వతి పుష్కరాల పూర్తి సమాచారం వెబ్‌సైట్‌, యాప్‌లో ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో దేవదాయశాఖకు ఆదాయం పెరిగిందన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల పుణ్యక్షేత్రాలకు వచ్చే మహిళా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్​ ప్రత్యేక చొరవ తీసుకొని పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపర్యవేక్షిస్తున్నారు.

కాళేశ్వరం వద్ద ఇప్పటికే ఉన్న గోదావరి పుష్కార ఘాట్లను ఆధునికీకరించడంతో పాటు అదనంగా ఘాట్లు నిర్మిస్తున్నారు. రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణం పనులు చేపడుతున్నారు. పుష్కరాల సందర్భంగా వీఐపీ ఘాట్‌ వద్ద 20 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాబలిపురంలో విగ్రహం తయారు చేయించి తీసుకరానున్నారు.