Sharwanand | శ‌ర్వానంద్ ‘భోగి’

  • By: sr    news    May 02, 2025 7:51 AM IST
Sharwanand | శ‌ర్వానంద్ ‘భోగి’

మ‌న‌మే చిత్రం త‌ర్వాత కాస్త‌ విరామం తీసుకున్న శ‌ర్వానంద్ (Sharwanand)త‌న త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి పెట్టాడు. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే ఓ ఐదు చిత్రాలు లైన్లో పెట్టిన శ‌ర్వ స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ సంపంత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న మూవీకి సంబంధించి కీల‌క అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు బోగి (Bhogi) అని టైటిల్ ఖ‌రారు చేసి ఓ గ్లింప్స్ ను సైతం విడుద‌ల చేశారు.

కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1960ల‌లో ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర ప్రాంతం బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, డింపుల్ హ‌య‌తి క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా పాన్ ఇండియాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.