Wave Fortune: వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో.. ట్యాప్ & పే

  • By: sr    news    Jun 19, 2025 10:07 AM IST
Wave Fortune: వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో.. ట్యాప్ & పే

ముంబయి: భారతదేశపు అగ్రగామి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్, దేశంలోని నంబర్ వన్ వేరబుల్ బ్రాండ్ బోట్ (boAt), ప్రపంచ పేమెంట్ టెక్నాలజీ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌తో జట్టు కట్టింది. కొత్తగా ఆవిష్కరించిన ‘వేవ్ ఫార్చూన్’ స్మార్ట్‌వాచ్‌తో నిరాటంకంగా, సురక్షితంగా చెల్లింపులు జరపడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. దీని ధర రూ. 3,299గా ఉంది (ప్రత్యేక ఆఫర్ల సందర్భంలో రూ. 2,599). వేవ్ ఫార్చూన్ వినియోగదారులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, నూతన స్మార్ట్‌వాచ్ అనుభవం అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.

నిరాటంక చెల్లింపుల విప్లవం

యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు ఇకపై తమ డెబిట్, క్రెడిట్ కార్డులు బోట్ అధికారిక పేమెంట్ యాప్ క్రెస్ట్ పే (Crest Pay) ద్వారా వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌లో సురక్షితంగా టోకెనైజ్ చేసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. మాస్టర్‌కార్డ్ టోకెనైజేషన్ టెక్నాలజీ, ట్యాపీ టెక్నాలజీస్ (TAPPY Technologies) పటిష్టమైన టోకెన్ రిక్వెస్టర్ మౌలిక సదుపాయాలు ఈ సేవకు తోడ్పడతాయి. ఈ ఫీచర్ పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే POS డివైజ్ వద్ద రూ. 5,000 వరకు ఒక్క అడుగుతో వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపులు అనుమతిస్తుంది.

మాస్టర్‌కార్డ్ మద్దతుతో, ఈ పేమెంట్ వ్యవస్థ వినియోగదారులకు వేగవంతమైన, నిరాటంక లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. కార్డులు స్మార్ట్‌వాచ్ స్ట్రాప్‌లో సురక్షితంగా టోకెనైజ్ చేసి నిల్వ చేసుకోవచ్చు. మాస్టర్‌కార్డ్, వీసా నెట్‌వర్క్‌లలోని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్‌లు వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో చెల్లింపులు జరిపేటప్పుడు తమ అనుసంధానిత కార్డ్ రివార్డులు, ప్రయోజనాలు ఆస్వాదించడం కొనసాగించవచ్చు.

అధికారుల అభిప్రాయాలు

ఆర్నికా దీక్షిత్, యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ & హెడ్ (కార్డ్స్, పేమెంట్స్, వెల్త్ మేనేజ్‌మెంట్) మాట్లాడుతూ, “వినియోగదారులకు వినూత్నమైన, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అందించడానికి యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ ఆవిష్కరణల ఆధారిత భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తుంది. నిరాటంకమైన, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు అందించడానికి బోట్‌తో జట్టు కట్టడం మాకు సంతోషం. టోకెనైజ్డ్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్లలో మా అనుభవంతో తీర్చిదిద్దిన వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్, వినియోగదారులకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన పేమెంట్ అనుభవం అందించడానికి తోడ్పడుతుంది” అని తెలిపారు.

సమీర్ మెహతా, బోట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో మాట్లాడుతూ, “రోజువారీ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి టెక్నాలజీ ఎల్లలు చెరిపివేయడానికి బోట్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. సురక్షితమైన, సులభతరమైన మణికట్టు ద్వారానే కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు నిర్వహించే సౌకర్యం అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో మా భాగస్వామ్యం తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు.

గౌతమ్ అగర్వాల్, మాస్టర్‌కార్డ్ డివిజన్ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) మాట్లాడుతూ, “సమీప భవిష్యత్తులో చెల్లింపులు సైగల ఆధారితమైనవిగా, మన రోజువారీ రొటీన్‌లో భాగమైనవిగా, సులభతరమైన లావాదేవీలుగా ఉంటాయి. వేరబుల్ డివైజ్‌లు ఈ పరిణామక్రమంలో కీలక పాత్ర పోషిస్తాయి. సత్వరమైన, సురక్షితమైన పేమెంట్ అనుభవాలు అందిస్తాయి. వ్యాపారాల భవిష్యత్ స్వరూపాన్ని తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్న మాస్టర్‌కార్డ్, టోకెనైజేషన్ ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌తో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరపడంలో సాధికారత పొందేందుకు తోడ్పడుతుంది” అని అన్నారు.

వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు

కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సదుపాయం పాటు, జిమ్ అయినా, ప్రయాణిస్తున్నప్పుడు అయినా, వ్యాపార పనుల్లో ఉన్నప్పుడు అయినా వినియోగదారులు ఎల్లప్పుడూ కనెక్టెడ్‌గా, స్టైలిష్‌గా, ప్రొడక్టివ్‌గా ఉండేలా వేవ్ ఫార్చూన్ రూపొందించబడింది. ఇది సురక్షితమైన, ఆన్-ది-గో చెల్లింపులు మణికట్టుపైకి చేర్చుతుంది. సౌకర్యం, కొత్త ఆవిష్కరణలు మేళవించి, లైఫ్‌స్టైల్ ఆధారిత వేరబుల్స్ రూపొందించాలన్న బోట్ విజన్‌కు ఇది ప్రతిబింబం.

కాంతులీనే డిస్‌ప్లే, సౌకర్యవంతమైన ఫీచర్లు:

సూర్య రశ్మిలోనూ అసాధారణమైన స్పష్టతతో, ప్రకాశవంతంగా కనిపించేలా 240×282 రిజల్యూషన్, 550 nitsతో 1.96” హెచ్‌డీ డిస్‌ప్లే.
సమయం, నోటిఫికేషన్లు వెంటనే యాక్సెస్ చేసుకోవడానికి వేక్ జెస్చర్. ఇమేజ్‌లు, థీమ్‌లు లేదా ఆర్ట్‌వర్క్‌లతో హోమ్ స్క్రీన్‌ను వ్యక్తిగతీకరించుకోవడానికి DIY వాచ్ ఫేస్ స్టూడియో  అంతర్నిర్మితమైన ఫిట్‌నెస్, యుటిలిటీ, ఫిట్‌నెస్ మైలురాళ్లు సాధించడం ద్వారా బోట్ కాయిన్‌లు సాధించవచ్చు – బోట్ ఆఫర్‌లు రీడీమ్ చేసుకోవచ్చు. అల్ట్రా-క్లియర్ బ్లూటూత్ కాలింగ్, ఇంటరాక్టివ్ డయల్ ప్యాడ్, కాంటాక్ట్ సేవింగ్, ‘క్రెస్ట్ పే’కి డైరెక్ట్ యాక్సెస్. వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు boAt వెబ్‌సైట్‌లో యాక్టివ్ బ్లాక్ రంగులో లభిస్తుంది.