లవ్ టైమ్..పుట్ట నుంచి సరసాల సయ్యాటలోకి పాముల జంట..!

పుట్టలో నుంచి బయటకు వచ్చిన పాముల జంట వర్షాకాల వాతావరణంలో పెనవేసుకుంటూ సాగించిన ప్రణయ క్రీడల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Jun 13, 2026, 4:41 pm IST
Read Time: 2 mins
లవ్ టైమ్..పుట్ట నుంచి సరసాల సయ్యాటలోకి పాముల జంట..!

పాముల సంభోగ, సంతానోత్పత్తి కాలంలో అవి భాగస్వామిని వెతుకుతూ..జతగాడితో సాగించే ప్రణయ కలాపాలు వీడియోలు తరుచూ చూస్తుంటాం. ఆశ్చర్యంగా ఓ పాముల జంట భూమిలోని పుట్ట నుంచి బయటకు వచ్చి సరస సయ్యాటలకు దిగిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఓ వైపు గోధుమ వర్ణంలోని పాము, మరోవైపు నల్లటి కింగ్ కోబ్రాను తలిపించే మరో పాము భూమిలోని పుట్ట కన్నాల నుంచి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి..తొలకరి వర్షాలతో చల్లబడిన ప్రకృతికి, ఆహ్లాదకరమైన వాతవరణానికి పరవశించాయి.

అవనిపై ఆతృతగా పెనవేసుకుంటూ సరస సయ్యాటలు సాగించాయి. ఒకదానికొకటి పోటీ పడుతూ సాగించిన పాముల సయ్యాటను చూసిన నెటిజన్లు పరవశించే ప్రకృతితో ప్రేమికుల సరస క్రీడలకు పాములైన, మనుషులైన ఒక్కటేనంటూ కామెంట్లు పెడుతున్నారు.