Shravana Masam 2025: శుభాల శ్రావణ మాసం ప్రారంభం
పెళ్లిళ్లు..వ్రతాలు..శుభాకార్యాల కాలం
Shravana Masam 2025 | విధాత : ఆషాడ మాసం గురువారంతో ముగిసిపోగా..శుక్రవారం నుంచి శ్రావణ మాసం(Shravana Masam) ప్రారంభమైంది. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్లు..వ్రతాలు, పండుగలు, పూజలు, ప్రారంభోత్సవాలు వంటి శుభ కార్యాలకు అనువైన కాలం. ముఖ్యంగా మంగళ గౌరీ, వరలక్ష్మి వ్రతాలు ఈ మాసంలోనే నిర్వహిస్తారు. శ్రావణ మాసంఅమ్మవారి వ్రతాలకు, పూజలకు ప్రత్యేకం. దేవాలయాల్లో అమ్మవార్లకు ఒడి బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అలాగే శివాలయాలు రుద్రాభిషేకాలు, విష్ణు ఆలయాల్లో ఆరాధనలు పూజలు కూడా ఈ మాసంలోనే జోరుగా సాగుతుంటాయి. అందుకే శ్రావణ మాసం దేవతలకు ప్రీతికరమంటారు. రాఖీ పండుగ, జంజిరాల పున్నం ఈ మాసంలోనే వస్తాయి. ఇకపోతే శ్రావణ మాసం వన భోజనాలకు ప్రసిద్ధి. ఇక కొత్త నిర్మాణాలు, గృహ ప్రవేశాలు, దుకాణాల ప్రారంభోత్సవాలు వంటి శుభ కార్యాలు శ్రావణ మాసంలో జోరుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
శ్రావణ మాసం(Shravana Masam) శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీన ముగుస్తుంది.ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభం కావడంతో ఆ నెలలో శుభకార్యాలు నిర్వహించడానికి వీలు లేదు. ఆ తర్వాత వచ్చే ఆశ్వయుజ, కార్తిక మాసాలు శుభ కార్యాలకు మంచివి. శ్రావణ మాసం మంచి రోజులకు అనువైనది కావడంతో ఈనెల 26, 30, 31 తేదీల్లోనూ, ఆగస్టులో 1, 3, 4, 6, 10, 13, 15, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలున్నట్లు బ్రాహ్మణులు చెబుతున్నారు. శ్రావణ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలకు అనువైంది కావడంతో ఈ నెలలో జరిగే జ్యూవెలరీ, వస్త్ర వ్యాపారాలతో పాటు వివాహా సంబంధిత బిజినెస్ తో మార్కెట్ వృద్ధి పొందనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram