Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా.. హ్యాండిచ్చిన శ్రీలీల, తమన్

Naveen Polishetty
విధాత: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సూపర్ సక్సెస్ చిత్రం తర్వాత, యాక్సిడెంట్‌కు గురై ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి నటిస్తున్న నూతన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించగా మూడేండ్ల క్రితమే ప్రారంభమై అప్పట్లోనే గ్లిమ్స్ విడుదల చేసిన ఈ మూవీ మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది.
చాలాకాలం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆటకెక్కిందనుకున్న సమయంలో సడన్‌గా హీరో నవీన్ పొలిశెట్టి జన్మదినం సందర్భంగా మరో టీజర్ విడుదల చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు.
ఇక ఈ మూవీని ప్రేక్షకులంతా మర్చిపోతున్న సమయంలో కొత్తగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆద్యంతం నవ్వులు పంచుతూ జాతిరత్నాలు 2 అనే మాదిరిగా ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. టీవీలో అంబానీ కుమారుడి పెళ్లి వీడియో వస్తుండగా రాజు అలియాస్ నవీన్ పొలిశెట్టి అంబానీకి ఫొన్ చేయడం, వచ్చిన గెస్టుల గురించి తనదైన స్టైల్‌లో వాళ్ల పేర్లు పలుకుతూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం2022లో ప్రకటించినప్పడు ఉన్న ముగ్గురు ప్రధాన టెక్నీషియన్స్ స్థానంలో ఇప్పుడు వేరే వారు వచ్చి చేరడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అందులో ముఖ్యంగా మొదట కథానాయికగా అనుకున్న శ్రీలీల (Sreeleela) స్థానంలో మీనాక్షి చౌదరి (Meenakshi), సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) ప్లేస్‌లో మిక్కీ జే మేయర్ (Micky J Meyor), చివరగా దర్శకుడు మ్యాడ్ ఫేం కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) స్థానంలో కొత్త దర్శకుడు మారి (Maari) వచ్చి చేరడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వీరు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లడానికి డేట్స్ ఇష్యూనా లేక, సినిమా లేటవడం వంటి ఏమైనా కారణాలా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.