Nagarkurnool : పుట్టిలో వాగు దాటిన విద్యార్థులు..వైరల్ గా వీడియో
నాగర్ కర్నూల్‌లో వాగు ఉధృతంగా ప్రవహించడంతో విద్యార్థులను పుట్టిలో ఎక్కించి సురక్షితంగా దాటించారు. వీడియో వైరల్ అవుతోంది.

Nagarkurnool | విధాత : తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులు వర్షాలు..వరదల జోరు కొనసాగుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో మారుమూల గ్రామాల్లోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉయ్యాలవాడ-చర్ల తిర్మలాపూర్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అవతలి వైపు చిక్కుకుపోయారు. దీంతో స్థానికులు స్పందించి, వారిని పుట్టి మీద ఎక్కించి వాగును దాటించి సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పుట్టిలో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు సురక్షితంగా వాగు దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.