JAAT Trailer: తెలుగు నాట తీసిన బాలీవుడ్ సినిమా.. స‌న్నీ డియోల్ జాట్ ట్రైల‌ర్ రిలీజ్‌! నార్త్ మొత్తం షేక్‌

  • By: sr    news    Mar 24, 2025 3:35 PM IST
JAAT Trailer: తెలుగు నాట తీసిన బాలీవుడ్ సినిమా.. స‌న్నీ డియోల్ జాట్ ట్రైల‌ర్ రిలీజ్‌! నార్త్ మొత్తం షేక్‌

స‌న్నిడియోల్ (Sunny Deol) క‌థానాయ‌కుడిగా గోపిచంద్ మ‌లినేని (Gopichand Malineni) ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers ), పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ (People Media Factory) సంయుక్తంగా నిర్మించిన చిత్రం జాట్ (JAAT). ర‌మ్య‌కృష్ణ‌, రెజినా క‌సాండ్ర‌, స‌యామి కేర్‌, వినీత్ కుమార్ సింగ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా బాలీవుడ్ టాప్ యాక్ట‌ర్ ర‌ణ‌దీప్ హుడా (Randeep Hooda) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. త‌మ‌న్ (ThamanS) సంగీతం అందించాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ మాస్ ఆడియ‌న్స్‌కు పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నం వ‌డ్డించేలా ఉన్న‌ట్లు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. చాలా సీన్ల‌లో హీరో ఎలివేష‌న్స్‌, డైలాగ్స్‌, ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు అంత‌కుమించి అనేలా ఉన్నాయి. బాలీవుడ్, స‌న్నిడియోల్ ఫ్యాన్స్‌కు క‌ల‌క‌కాలం గుర్తుండి పోయే చిత్రంగా రూపొందించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే గోపీచంద్ భారీ హిట్ సాధించేలానే ఉన్నాడు. ట్రైల‌ర్ చివ‌ర‌లో నా చేయి ప‌వ‌రేంటో ఇన్నాళ్లు నార్త్ చూసింది.. ఇప్పుడు పూర్తి సౌత్ చూస్తుంది అంటూ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తీసుకు వ‌చ్చేలా ఉంది.