NBK 111 | బాలయ్య అభిమానులకి మరో పండుగ.. ఇక యోధుడిగా సందడే సందడి
NBK 111 | వరుస విజయాలతో ఊపిరి పీల్చుకునే సమయమే లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ విజయాల తర్వాత బాలయ్య ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
NBK 111 | వరుస విజయాలతో ఊపిరి పీల్చుకునే సమయమే లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ విజయాల తర్వాత బాలయ్య ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే నేపథ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తుండగా, ఈ మూవీ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ‘అఖండ 2’ తర్వాత బాలయ్య మళ్లీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111లో నటించబోతున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కావొచ్చని ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. గతంలో వీరసింహారెడ్డిలో బాలయ్యను విభిన్నంగా చూపించిన గోపీచంద్, ఈసారి మరొక లెవల్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అనౌన్స్‌మెంట్ తోనే సాలిడ్ బజ్ ని ఈ ప్రాజెక్ట్ సొంతం చేసుకోగా,ఇక తాజాగా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో ఫ్యాన్స్ ఆనందం డబుల్ అయింది.ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు. పోస్టర్‌లో రెండు పవర్ఫుల్ లుక్స్ అంచనాలు పెంచాయి. ఒక పాత్ర వారియర్‌గా మరో పాత్ర యుద్ధ యోధునిగా ఉంటుందని తెలుస్తుంది. షర్ట్ లేకుండా రుద్రాక్ష మాలలతో కనిపిస్తున్న బాలయ్యని చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించినట్టుగా అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో వరల్డ్ మ్యాప్, కోటలు, యుద్ధరంగం, ఇసుకలో కత్తి, దానిని చుట్టూ గడియారపు ఆకృతి కనిపించడంతో, ఈ చిత్రం టైమ్ ట్రావెల్ ఆధారిత చారిత్రక కథ అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ..“బాలయ్య బాబుతో గోపీ చాలా గొప్ప సినిమా తీస్తున్నాడు. ఇది ఆషామాషీ సినిమా కాదు. భారీ సెటప్… ప్రీ విజ్యువల్స్ చూసాను, అదరగొట్టేశాడు గోపీ. కాంతార 2 కెమెరామెన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడు. మూవీ అస్సలు మామూలుగా రాదు అని చెప్పడంతో అంచనాలు పీక్స్‌కి చేరాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram