Esha Deol Refuses Dharmendra Death Rumours | మా నాన్న చనిపోలేదు.. చంపేయకండి : ధర్మేంద్ర కూతురు
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర చనిపోయారనే వార్తలు ఫేక్ అని ఈషా డియోల్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఆరోగ్యం బాగుందని హేమా మాలిని తెలిపింది.
విధాత : బాలీవుడ్ స్టార్, వెటరన్ హీరో ధర్మేంద్ర చనిపోయినట్టుగా మంగళవారం ఉదయం నుంచి బాలీవుడ్ మీడియాలో వెలువడిన కథనాలు సంచలనం రేపాయి. మీడియా కథనాలతో ధర్మేంద్ర చనిపోయారని అందరూ భావించారు. కొంతమంది తెలుగు సహా బాలీవుడ్ హీరోలు, అలాగే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో స్పందించారు.
కానీ ధర్మేంద్ర చనిపోలేదని ఆయన కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మీడియా వర్గాలు తొందరపాటుతో ఫాల్స్ న్యూస్ వ్యాప్తి చేశాయని పేర్కొంది. మా నాన్న ఆరోగ్యం బానే ఉంది. అలాగే, ఆయన రికవరీ అవుతున్నారు. అందరూ మా ఫ్యామిలీకి ప్రైవసీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా నాన్న త్వరగా కోలుకోవడానికి ప్రార్థిస్తున్న అందరికీ థాంక్స్. మీ ఈషా డియోల్” అంటూ ఆమె స్పందించింది. అటు ధర్మేంద్ర భార్య, సీనియర్ నటి, ఎంపీ హేమా మాలిని సైతం ధర్మేంద్ర మరణ వార్తలను తీవ్రంగా ఖండించారు. ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయాడంటూ మీడియా ప్రచారం చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నదంటూ ఫేక్ న్యూస్‌పై హేమా మాలిని అసహనం వ్యక్తం చేశారు. ఇది క్షమించరానిదని మండిపడ్డారు.
బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ధర్మేంద్రను ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవ్ ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఎక్స్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram