Shubman Gill: టీమిండియా..కెప్టెన్‌గా శుభమన్ గిల్

  • By: sr    news    May 24, 2025 3:07 PM IST
Shubman Gill: టీమిండియా..కెప్టెన్‌గా శుభమన్ గిల్
  • వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్
  • సాయి సుదర్శన్, అర్షదీప్ సింగ్ లకు చాన్స్
  • 18మందితో జట్టు ప్రకటన
  • కరుణ్ నాయర్ కు మళ్లీ పిలుపు

విధాత: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త సీజన్ కు భారత జట్టు కొత్త కెప్టెన్ తో సిద్ధమైంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత టెస్టు క్రికెట్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. టెస్టు క్రికెట్ టీమిండియా నూతన సారధిగా ..రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభమన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది. మొత్తం 18మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

టెస్టు జట్టులోకి తొలిసారిగా బ్యాటర్ సాయి సుదర్శన్, పేసర్ ఆర్షదీప్ సింగ్ లను తీసుకుంది. అలాగే కరుణ్ నాయర్ కు ఏనిమిదేళ్ల తర్వాతా తిరిగి టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. అతను చివరిసారిగా 2017మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. దేశవాళీ పోటీల్లో పరుగుల వరద పారించడంతో పాటు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ల నేపథ్యంలో కరుణ్ నాయర్ కు ఛాన్స్ దక్కింది. కోహ్లీ స్థానంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లలో ఒకరిని ఆడించే అవకాశముంది.

గాయాల పాలైన పేసర్ షమీతో పాటు బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, సర్పరాజ్ ఖాన్ లకు జట్టులో స్థానం దక్కలేదు. భారత జట్టు జూన్ 20నుంచి ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఆడనుంది. కెప్టెన్ రేసులో బూమ్రా పేరు పరిశీలన చేసినప్పటికి అతడిపై అదనపు భారం వేయకూడదన్న ఉద్దేశంతో బీసీసీఐ శుభమన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించింది.

టీమిండియా టెస్టు జట్టు

శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్. రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు ఎంపికయ్యారు.