Mlc Elections: తెలంగాణ, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

విధాత: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణలో రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలకు, ఒక పట్టభద్రుల నియోజకవర్గానికి, ఏపీలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషన్ తన షెడ్యూల్ లో తెలిపింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన స్క్రూట్నీ చేస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసహరణకు గడువు విధిస్తారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఈ మేరకు ఎన్నికలు జరుగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నట్లు ఎన్నికల క మిషన్ వెల్లడించింది. తెలంగాణ, ఏపీల్లోని ఈ ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు (Mlc Elections) 2025 మార్చి 29వ తేదీన ఖాళీ అవుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల స్వీకరణ (నోటిఫికేషన్ విడుదల) 2025 ఫిబ్రవరి 3
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు 2025 ఫిబ్రవరి10
నామినేషన్ల స్క్రూట్నీ 2025 ఫిబ్రవరి11
నామినేషన్ల విత్ డ్రాకు తుది గడువు 2025 ఫిబ్రవరి13
పోలింగ్ 2025 ఫిబ్రవరి27 (పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు 2025 మార్చి 3వ తేదీ
పదవీ కాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలు వీరే..
నియోజకవర్గం ఎమ్మెల్సీ పేరు
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ కరీంనగర్ పట్టభుద్రుల నియోజకవర్గం టి.జీవన్ రెడ్డి
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం కూర రఘోత్తం రెడ్డి
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఏపీలో
ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల పట్టభుద్రుల నియోజకవర్గం ఐ. వెంకటేశ్వరరావు
క్రుష్ణ, గుంటూరు జిల్లాల పట్టభుద్రుల నియోజకవర్గం కె ఎస్. లక్ష్మణ రావు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం ఉపాధ్యాయ నియోజకవర్గం పాకల పట్టి రఘువర్మ