Term Insurance: పిల్లల భవిష్యత్తుకు.. టర్మ్ ఇన్సూరెన్స్ రక్షణ

  • By: sr    news    Jun 19, 2025 10:13 AM IST
Term Insurance: పిల్లల భవిష్యత్తుకు.. టర్మ్ ఇన్సూరెన్స్ రక్షణ

పుణె: భారత దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటీవల పిక్సిస్ గ్లోబల్, క్వాల్స్.ఏఐ కలిసి బజాజ్ అలయంజ్ లైఫ్ ఉమెన్ టర్మ్ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ పద్ధతులు వాడారు. మెట్రోలు, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల నుండి 1,000 మంది పైగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే మహిళలు దీనిలో పాల్గొన్నారు. వారి ఆర్థిక ప్రాధాన్యతలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే సన్నద్ధత, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం పాటించే వ్యూహాలు అంచనా వేశారు.

ఆర్థిక ప్రాధాన్యతలలో మార్పులు

ఆర్థిక ప్రాధాన్యతలలో గణనీయ మార్పులు జరిగినట్లు ఈ సర్వే తెలిపింది. దీని ప్రకారం పిల్లల భవిష్యత్తు, విద్యా వ్యయాలు, ఆరోగ్యం ప్రధాన అంశాలుగా మారాయి. పిల్లల భవిష్యత్తు రక్షణకు ఆర్థిక సాధనాలలో మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్య సంబంధిత రిస్కులపై అవగాహన పెరిగిన సూచన ఇది. వైద్యపరమైన అనూహ్య ఖర్చుల వల్ల తమ కుటుంబాల పొదుపు తీవ్ర ప్రతికూల ప్రభావం పొందుతుందని 53 శాతం మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొన్నారు. తమ టర్మ్ ప్లాన్‌లో అంతర్గతంగా హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు తప్పనిసరిగా ఉండాలని 50 శాతం మంది తెలిపారు. పిల్లల చదువు ప్రయోజనాలు కూడా టర్మ్ ప్లాన్‌లో భాగంగా ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు. ఆర్థికంగా స్వతంత్ర మహిళలు, బీమాను కేవలం జీవిత రక్షణకు మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి కూడా ఉపయోగపడే సాధనంగా పరిగణిస్తున్న విషయం ఇది ధృవీకరిస్తుంది.

“బజాజ్ అలయంజ్ లైఫ్ ఉమెన్ టర్మ్ సర్వే 2025 ప్రకారం మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్‌ను కేవలం లైఫ్ కవరేజీగా మాత్రమే చూడటం లేదు. తమ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణమైన కీలకమైన, సమగ్రమైన ఆర్థిక సొల్యూషన్‌గా పరిగణిస్తున్నారు. టర్మ్ ప్లాన్ కవరేజీ పిల్లల ఆర్థిక భవిష్యత్తు, ఆరోగ్య సమస్య సంబంధిత వ్యయాలు, తీవ్ర అనారోగ్యాలు, కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక భద్రత అందించేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడంలో మహిళా కస్టమర్లకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో ఈ అంశాలు మాకు తోడ్పడతాయి” అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ తెలిపారు.

సర్వేలో ప్రధాన అంశాలు

పిల్లల ఆర్థిక భవిష్యత్తు అత్యంత ప్రాధాన్యం:

ఏదైనా అనుకోనిది జరిగితే పిల్లలకు ఆర్థిక స్థిరత్వం ఎలా కల్పించాలనేది 61 శాతం మంది మహిళలకు ప్రాథమిక ఆందోళనకర అంశం.
ఆదాయ స్థిరత్వం (61%), ఆరోగ్య వ్యయాలు (53%), రిటైర్మెంట్ ప్లానింగ్ (54%), పిల్లల చదువు (57%) ప్రధాన ఆర్థిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ పిల్లల ఆర్థిక భద్రతకు ప్రాధాన్య ఎంపిక:
తమ పిల్లల ఆర్థిక భవిష్యత్తు కాపాడటానికి 46 శాతం మంది మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ లక్ష్య సాధనకు ఇది ఆర్థికంగా అత్యంత ప్రాధాన్యత ఎంపికగా నిలుస్తుంది.

అనూహ్య హెల్త్, మెడికల్ వ్యయాలు పొదుపుపై ప్రభావం:
టర్మ్ ఇన్సూరెన్స్‌లో ‘క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీ’ అత్యంత ఆకర్షణీయమైన అంశమని 87 శాతం మంది మహిళలు భావిస్తున్నారు.
టర్మ్ ప్లాన్‌లో ‘అంతర్గతంగా హెచ్ఎంఎస్, హెల్త్/సీఐ కవర్’ తప్పనిసరిగా ఉండాలని 57 శాతం మంది మహిళలు భావిస్తున్నారు.

టర్మ్‌లో చైల్డ్ ఇన్‌కం ప్రొటెక్షన్ ఫీచర్‌పై అత్యధిక ఆసక్తి:

టర్మ్ ప్లాన్‌లో ‘చైల్డ్ ఇన్‌కం సెక్యూరిటీ’ ఫీచర్ అత్యంత ఆకర్షణీయమైనదిగా 93 శాతం మంది మహిళలు భావిస్తున్నారు.

టర్మ్ ఇన్సూరెన్స్‌లో మహిళలు కోరుకునే ఇతర ఫీచర్లు:

జీవితంలో ముందుకెళ్లే కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా కవరేజీ పెంచుకునే వెసులుబాటు, మెచ్యూరిటీ బెనిఫిట్స్ కావాలని 51 శాతం మంది కోరుకుంటున్నారు. టర్మ్ ప్లాన్లలో పిల్లల చదువుపరంగా ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా ఉండాలని 33 శాతం మంది తల్లులు కోరుకుంటున్నారు. అత్యధిక లైఫ్ కవరేజీ ఉన్న టర్మ్ ప్లాన్‌లు కావాలని 28 శాతం మంది మహిళలు కోరుకుంటున్నారు.

టర్మ్ ప్లాన్లలో అంతరాలపై అభిప్రాయాలు:

కవరేజీ సవరించుకునే వెసులుబాటు లేకపోవడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు లేకపోవడం, క్లెయిమ్ ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండటం ప్రధాన నిరోధకాలుగా ఉన్నాయని మహిళలు తెలిపారు. ప్రీమియంలు అందుబాటు స్థాయిలో ఉండాలని, హెల్త్/సీఐ కవరేజీ రైడర్లు కావాలని అత్యధికంగా కోరుకుంటున్నారు. మారుతున్న మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దిన టర్మ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ ఆవశ్యకతను సర్వే తెలియజేస్తుంది. ప్రస్తుత అంతరాలను పరిష్కరించి, మహిళలు కోరుకునే ఫీచర్లతో టర్మ్ ప్లాన్‌లు మెరుగుపరచడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా, భద్రత అందించి సాధికారత కల్పించాలని బజాజ్ అలయంజ్ లైఫ్ లక్ష్యం.