Telangana | తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో చోరీ

Telangana | తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో చోరీ ఘటన సంచలనం రేపింది. రాజ్ భవన్ లో కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు చోరేకి గురయ్యాయి. రాజభవన్ సుధర్మభవన్ లో నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి .మొదటి అంతస్తులో రూము నుంచి హార్డ్ డిస్క్ ల అపహరణ జరిగినట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు . ఈనెల 14న రాత్రి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాజభవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెల్మెట్ తో ఆగంతకుడు కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి హార్డ్ డిస్కులను చోరీ చేసినట్లు నిర్ధారించారు. వాటిలో రాజభవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. రాజ్ భవన్ ఐటీ మేనేజర్ 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితుడిగా శ్రీనివాస్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.