Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. దలాల్ స్ట్రీట్ ఢమాల్

  • By: sr    news    Apr 07, 2025 12:57 PM IST
Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. దలాల్ స్ట్రీట్ ఢమాల్

Trump:

విధాత: ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రపంచ దేశాల సూచీలన్ని నష్టాల బాటలోనే కొనసాగాయి. దీంతో 1987నాటి బ్లాక్ మండే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అసియా, ఐరోపా, అస్ట్రేలియా సహా ప్రపంచ మార్కెట్లన్ని కూడా 3నుంచి 10శాతం నష్టాలు చవిచూశాయి. గతంలో బ్లాక్ మండే వ్యవహారంలో ప్రపంచ సూచీలు 20శాతంకు పైగా నష్టాలపోయాయి. దీంతో ఆ రోజును బ్లాక్ మండేగా అభివర్ణించారు.

ఈ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3000+ పాయింట్స్ కు పడిపోయి 72,431వద్ధ ట్రేడవుతోండగా..నిఫ్టీ 920పాయింట్ల నష్టంతో 21,984వద్ధ కొనసాగుతోంది. నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.20లక్షల మేరకు ఆవిరైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ 19పైసలు తగ్గి 85.63వద్ధ కొనసాగుతోంది.

మరోవైపు.. ట్రంప్ ప్రకటించిన సుంకాలతో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు కొనసాగాయి. సోనీ కంపనీ షేర్లు 10 శాతం పతనమైనమయ్యాయి. దీంతో సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో పలు ప్రపంచ దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి.