జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

విధాత వరంగల్ ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అరులైన వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ అందేలా కృషి చేస్తాననని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టులు తమ హక్కుల కోసం గత తొమ్మిది రోజులుగా చేస్తున్న దీక్షలో భాగంగా ఆయనను కలిసి వినతిపత్రం, లిస్ట్ అందజేశారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి డబుల్ బెడ్రూమ్స్ సమస్యతో పాటు ఇతర సమస్యలపై వివరించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్స్ విషయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో స్వయంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా అర్హులైన జర్నలిస్టులకు డబ్బులు వచ్చేలా కృషి చేస్తానని అప్పటివరకు సమయమనం పాటించాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్స్ విషయంలో స్పష్టత వచ్చే వరకు నిరాహార దీక్షలతో పాటు పలు రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా జర్నలిస్ట్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా వరంగల్ తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.