TTD | తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక..! 9న ఆర్జిత సేవలు రద్దు..!
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. విశేష పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం.. ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పర్వదినం సందర్భంగా 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ క్రమంలో భక్తులు విషయాన్ని గమనించాలని సూచించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram