యెమెన్‌పై అమెరికా వైమానిక దాడి.. 74కి పెరిగిన మృతులు
విధాత: యెమెన్‌లో హూతీలపై అమెరికా జరిపిన వైమానిక దాడులలో మృతుల సంఖ్య 74కి పెరిగింది. దాడులలో 171మంది గాయపడినట్లు హూతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు. . అమెరికా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య గత కొంత కాలంగా దాడులు జరుగుతున్నాయి.
నాలుగు రోజుల క్రితం మారిబ్ పై అమెరికా వైమానిక దాడులు జరపడంతో 123 మంది మృతి చెందగా 247 మంది గాయపడిన విషయం తెలిసిందే.యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు ఎర్ర సముద్రంలోని నౌకల సమాచారం చేరవేస్తున్న చైనా ఉపగ్రహాలు అందిస్తున్నాయని అమెరికా తాజాగా ఆరోపించింది. ఈ చర్యలను ఏమాత్రం ఆమోదించమని హెచ్చరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram