వాట్సాప్‌లో వ్యాక్సిన్ సర్టిఫికెట్.. డౌన్‌లోడ్ ఇలా..!
విధాత:కరోనా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ‘MyGov Corona Helpdesk’ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.ఇప్పటి వరకూ వ్యాక్సిన్ కేంద్రాలు, టెస్టింగ్ కేంద్రాలు వంటి వివరాలు తెలియజేసిన ఈ హెల్ప్‌డెస్క్.. ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను నేరుగా వాట్సాప్‌లోనే పొందే సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం 90131 51515 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.చాట్ విండో ఓపెన్ చేసి డౌన్‌లోడ్ సర్టిఫికెట్ అని సందేశం పంపించాల్సి ఉంటుంది. మీ నంబర్ […]
విధాత:కరోనా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ‘MyGov Corona Helpdesk’ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.ఇప్పటి వరకూ వ్యాక్సిన్ కేంద్రాలు, టెస్టింగ్ కేంద్రాలు వంటి వివరాలు తెలియజేసిన ఈ హెల్ప్‌డెస్క్.. ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను నేరుగా వాట్సాప్‌లోనే పొందే సదుపాయం కల్పిస్తోంది.
ఇందుకోసం 90131 51515 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.చాట్ విండో ఓపెన్ చేసి డౌన్‌లోడ్ సర్టిఫికెట్ అని సందేశం పంపించాల్సి ఉంటుంది. మీ నంబర్ ఇది వరకే కొవిన్ ప్లాట్‌ఫాంలో నమోదై ఉంటే ఆ నంబర్‌కు ఆరెంకెల ఓటీపీ వస్తుంది.వ్యక్తి పేరును ధ్రువీకరించిన తర్వాత కొన్ని క్షణాల్లోనే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీ ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది.ఒకవేళ వ్యాక్సిన్ కోసం వేరే మొబైల్ నంబర్ ఇచ్చి ఉంటే ఆ ఫోన్ నుంచే ఈ సందేశం పంపించాల్సి ఉంటుంది.వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో పాటు కరోనాకు సంబంధించిన సలహాలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లు, కొవిడ్‌కు సంబంధించిన అపోహలు, వాటికి నిపుణుల సమమాధానాలు వంటివీ ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram