Warangal: వెంకటాపురం ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం

  • By: sr    news    Mar 20, 2025 1:52 PM IST
Warangal: వెంకటాపురం ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం

విధాత ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ పట్టణంలో ఎస్ ఐ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం కలకలం సృష్టించింది. వెంకటాపురంలో పనిచేస్తున్న ఎస్ఐ భార్య మాయూరి ( ఆలియస్ ) వెన్నెల ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన భర్త ఓ టీచర్ భార్యతో వివాహేతరసంబంధం కొనసాగిస్తున్నట్లుగా ఆమె పేర్కొంటూ ఆ బాధను తట్టుకోలేక మత్తు టాబ్లెట్లు వేసుకుంటున్నట్లు వివరించారు.

ఈ మేరకు తాను కారులో కూర్చుని ట్యాబ్లెట్లు వేసుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మొత్తం విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేశారు. ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త ఓ టీచర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, పద్ధతి మార్చుకోమని చెప్పిన తన భర్త వినలేదని ఆమె అరోపించారు. ఈ తీవ్ర మానసిక వేదనను తట్టుకోలేక ఆత్మహత్య కు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన ఆమెను హస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం మహబూబాబాద్ హస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.