Veera Dheera Sooran: ఇదేందయ్యా ఇది.. పార్ట్1 లేకుండానే పార్ట్2

తంగలాన్ వంటి మంచి విజయం తర్వాత విక్రమ్ నటిస్తోన్న చిత్రం వీర ధీర శూర పార్ట్2. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సంవత్సరం సిద్ధార్థ్‌తో చిత్తా (చిన్నా) అనే డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన SU అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.
అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 1 షూటింగ్ చేయకుండానే పార్ట్2 చిత్రీకరణను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం విశేషం. ఈ మూవీ విడుదల అనంతరం ఫ్రీక్వెల్‌గా మొదటి భాగాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటెంది. విక్రమ్ కిరాణ షాపు నడిపేవాడిగా మరోవైపు నేర ప్రపంచంతో సంబంధాలు, పోలీసులతో పోరాడే వ్యక్తిగా నటిస్తోండగా దుషారా విజయన్ కథానాయిక. ఎస్జే సూర్య, మలయాళ పాపులర్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు, సిద్ధిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.