Warangal: రూ.1071.48 కోట్ల అంచనాలతో వరంగల్ బల్దియా బడ్జెట్

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2025-2026 సం.రానికి రూ.1071.48 కోట్ల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గురువారం పాలక వర్గం ఆమోదించింది. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం బడ్జెట్ ను ఆమోదించింది. రూ.1071.48 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు.
ఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డీపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి , వర్షన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య , జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖేడే, డెప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.