Sridhar babu: జై తెలంగాణ నినాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Sridhar babu:  జై తెలంగాణ నినాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Sridhar babu:  జై తెలంగాణ నినాదం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనే నినాదం ఎందుకు చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గతంలోనూ చాలా మంది నేతలు ముఖ్యమంత్రి జై తెలంగాణ అని నినదించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాగా తాజాగా ఇదే విషయంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. జై తెలంగాణ అనే నినాదం ఎవరికీ పేటెంట్ కాదని పేర్కొన్నారు. ఒక పార్టీకి సంబంధించిన నినాదం ఏమీ కాదన్నారు. తెలంగాణ ప్రజలందరిదీ ఈ నినాదం అని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని.. దర్యాప్తులో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని కవిత రాజకీయం చేయడం సరికాదన్నారు. గతంలో తాము చెప్పిన విషయాన్నే తాజాగా కవిత ప్రస్తావించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో చెప్పిందని శ్రీధర్ బాబు గుర్తుకు పేర్కొన్నారు. ఇప్పుడు కవిత అదే విషయం చెప్పిందన్నారు.