Yandamuri Veerendranath: ‘ఆయ్.. మాది నరసాపురమండీ’కి.. యండమూరి ప్ర‌శంస‌లు

భావరాజు పద్మినీ ‘ఆయ్ .. మాది నరసాపురమండీ’ గ్రంథాన్ని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం నరసాపురం ఊరి అనుబంధాలు, చరిత్ర, పాత కట్టడాలు, నదీ పరివాహక ప్రాంతపు సౌందర్యం, పెద్దతరాల అనుభవాలను ప్రతిబింబిస్తుంది. ప్రముఖ సాహితీ విశ్లేషకులు, కవి, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరై అభినందనలు తెలియజేశారు.

  • By: sr    news    Oct 03, 2025 5:08 PM IST
Yandamuri Veerendranath: ‘ఆయ్.. మాది నరసాపురమండీ’కి.. యండమూరి ప్ర‌శంస‌లు

హైదరాబాద్: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కారుణ్యంతో, ప్రముఖ రచయిత్రి మరియు అచ్చంగా తెలుగు ప్రచురణల చైర్మన్ భావరాజు పద్మినీ తన సొంత ఊరి అనుబంధాలు, భౌగోళిక, నైసర్గిక సౌందర్యం, చరిత్ర, పాత కట్టడాలు, కళాశాలలు, పాఠశాలల విశేషాలతో పాటు పెద్దతరాల అనుభవాలను ప్రతిబింబించే ‘ఆయ్ .. మాది నరసాపురమండీ’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఈ పుస్తకం గోదారి నదీ పరివాహక ప్రాంతంలో బాల్యం గడిపినవారికి ప్రత్యేకమైన భావోద్వేగాన్ని అందిస్తుంది. యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ, ఈ పుస్తకం చదివిన ప్రతీ పాఠకుడికి అనుబంధాలు, ఊరి ప్రేమ, చిన్నపాటి స్మృతులు కళ్ళ ముందుకు వస్తాయని, భావరాజు పద్మినీ అద్భుతంగా ఈ ఊరి ముచ్చట్లను గ్రంథరూపంలో అందించారని ప్రశంసించారు.

పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రమేష్, భావరాజు పద్మినీ మిత్ర బృందం లక్ష్మి, పద్మావతి, నగీనా, అనసూయ, వల్లి, ఈష, భట్టిప్రోలు సత్యనారాయణ, శేషగిరి, ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా, ప్రముఖ సాహితీ విశ్లేషకులు, కవి రెడ్డప్ప ధవేజీ ఈ గ్రంథాన్ని తెరిచే ప్రతి పేజీలోని అనుభూతులు, ఆనందాలు, ఊరి ముచ్చట్లు రాబోయే తరాలకు తెలియజేస్తాయని అభినందించారు. ఈ గ్రంథం తెలుగు పాఠకులకు సొంత ఊరి చరిత్రను, స్థానిక అనుబంధాలను, పాత కట్టడాల వైభవాన్ని, నదీ తీరపు సౌందర్యాన్ని అనుభూతిపరచే విలక్షణ అవకాశం కల్పిస్తుంది.