Jyoti Malhotra | నన్ను పెళ్లి చేసుకో.. పాకిస్థాన్ ఏజెంట్ తో జ్యోతి మల్హోత్రా.. చాటింగ్ లీక్
యూట్యూబ్ వ్లాగర్ కు సంబంధించిన విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ ఏజెంట్ తో చేసిన ఓ చాట్ లీక్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని.. పాకిస్థాన్ లోనే వివాహం జరగాలని జ్యోతి కోరడం గమనార్హం.

Jyoti Malhotra | మనదేశానికి చెందిన రహస్య సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్ కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబ్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె ఓ ఐఎస్ఐ ఏజెంట్ తో చేసిన చాటింగ్ ను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
తనను పెళ్లి చేసుకోవాలంటూ జ్యోతి ఐఎస్ఐ ఏజెంట్ ను కోరింది. పాకిస్థాన్ లోనే తమ వివాహం జరగాలని జ్యోతి కోరుకోవడం గమనార్హం. మనదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా పాకిస్థాన్ కు చేరవేసినట్టు తెలుస్తున్నది. అలీ హాసన్ అనే ఐఎస్ఐ ఏజెంట్ తో ఆమె పలు సందర్భాల్లో చేసిన చాటింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. కోడ్ భాషలో ఉన్న ఈ చాట్ ను అధికారులు డీకోడ్ చేస్తున్నారు.
దుబాయ్ నుంచి డబ్బులు
జ్యోతికి మొత్తం నాలుగు ఖాతాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటికి దుబాయ్ కి చెందిన బ్యాంకుల నుంచి డబ్బు వస్తున్నట్టు సమాచారం. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. యూట్యూబ్ వ్లాగర్ జ్యోతికి మనదేశంలో పాకిస్థాన్ లో అనేక ప్రదేశాల గురించి వీడియోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆమెకు డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ద్వారానే అలీ హాసన్ కూడా దగ్గరైనట్టు సమాచారం.