Online Terrorism Course | మహిళలకు ‘ఉగ్ర’ పాఠాలు!.. జైషే మహమ్మద్ స్పెషల్ ఆన్‌లైన్ కోర్సు
జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో మహిళలను నియమించుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంగా ‘జమాత్ ఉలత్ ముమినాత్’ పేరుతో కోర్సు ఏర్పాటు చేశారని సమాచారం. భర్తితో పాటు నిధుల సమీకరణకు ఇది దోహదపడుతుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే అని చెప్పాలి. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్లో ఈ దాయాది దేశం ముందువరుసలో ఉంటూ రక్త పాతం సృష్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ కర్రు కాల్చి వాత పెట్టినా పాకిస్తాన్ బుద్ది మార్చుకోవడం లేదు. ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇస్తూ పెంచి పోషిస్తున్న పాక్‌లో ప్రధాన ఉగ్ర సంస్థగా పేరొందిన జైషే మహమ్మద్ మళ్లీ తన ఉగ్ర పన్నాగాలతో ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రపంచంలో జరిగిన అనేక ఉగ్రదాడిలో ఈ సంస్థ హస్తం ఉంది. తాజాగా జైషే మహమ్మద్ తన పరిధిని విస్తరించుకోవాలనుకుంటోంది. దీనికి ఈ సారి మహిళలను ఎంచుకుంది.
మహిళలను ఉగ్రవాదంలోకి దింపే ప్రయత్నంలో భాగంగా ఓ స్పెషల్ ఆన్ లైన్ కోర్సును ప్రారంభించింది. ‘జమాత్ ఉలత్ ముమినాత్’ పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనే వారి నంచి 500ల పాక్ కరెన్సీని వసూలు చేయనుంది. కాగా, ఈ కోర్సుకు నేతృత్వం వహించేది ఎవరో కాదు జేషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ అక్కాచెళ్లెల్లు కావడం గమనార్హం. సాదియా, సమైరా అజర్ లు ఈ ఆన్ లైన్ కోర్సులో మహిళలకు జిహాద్, మతపరమైన సిద్ధాంతాలతో పాటు సంస్థలో మహిళల పాత్రలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. నవంబర్ 8 నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుండగా.. ప్రతి రోజు 40 నిమిషాల ప్రత్యక్ష ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి.
అయితే, ఇది కేవలం మతపరమైన కోర్సు మాత్రమే కాదని.. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో మహిళలను నియమించుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంగా ‘జమాత్ ఉలత్ ముమినాత్’ పేరుతో కోర్సు ఏర్పాటు చేశారని సమాచారం. భర్తితో పాటు నిధుల సమీకరణకు ఇది దోహదపడుతుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పాకిస్తాన్ లో నెలకొన్న సామాజిక కారణాల వల్ల మహిళల బలహీనతలను జైషే క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఐసీస్, హమాస్ తరహాలో మహిళ ఉగ్ర దళాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరిని భవిష్యత్తులో సూసైడ్ బాంబులు లేదా ఫిదాయిద్ దళాలుగా మార్చే అవకాశాలు ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram