Solar Storm | 14వేల ఏళ్ల నాటి స్థాయిలో సౌర తుఫాను మళ్లీ వస్తుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

గత కొన్నేళ్లుగా సౌర తుఫానులు సర్వసాధారణంగా మారిపోయాయి. సూర్యుడు అత్యంత తీవ్రస్థాయిలో చురుకుగా మారే దశలోకి వెళ్లడం వల్లే ఈ సౌర తుఫానులు (సాధారణంగా చెప్పాలంటే అత్యంత తీవ్రమైన వడగాడ్పులు) వస్తున్నాయని చెబుతున్నారు. ఈ వారంలో మే 14వ తేదీన (మే 14, 2025)న సూర్యుడి నుంచి ఎక్స్‌ క్లాస్‌ మంటలు విడుదలయ్యాయి.

Solar Storm | 14వేల ఏళ్ల నాటి స్థాయిలో సౌర తుఫాను మళ్లీ వస్తుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Solar Storm | గత మూడేళ్లుగా ఎండలు మండిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది కొన్ని వారాల పాటు సూర్యుడు యాక్టివ్‌గా ఉన్నాడు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. సూర్యుడు మరోసారి యాక్టివ్‌గా మారి, ఒక సన్‌స్పాట్‌ నుంచి అధికంగా మంటలు వెదజల్లుతున్నది. దాని కొస పది లక్షల కిలోమీటర్ల వరకూ ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది సూర్యుడు మండిపోవడంతో కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ విడుదల కావడం, భూమిపై అరోరాలను రేకెత్తించడంతోపాటు.. రేడియో సిగ్నల్స్‌ను భగ్నం చేశాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. అయితే.. 14,300 ఏళ్ల క్రితం జరిగినదానితో పోల్చితే మనం ఇప్పటి వరకూ భరించిన వేడి ఏ మాత్రం లెక్కించాల్సింది కాదని అంటున్నారు. ఈ భూమిపై సరిగ్గా 12,350 బీసీఈలో బలమైన సౌర తుఫాను (Solar Storm) రికార్డయింది. బహుశా అప్పటికి అది మంచుయుగం (ఐస్‌ ఏజ్‌) చివరిలో వచ్చిన మొదటిదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి చరిత్రలోనే అది అత్యంత శక్తమంతమైన సౌర తుఫాను అని ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటున్నది.

సౌర తుఫానులు ఇప్పటి వరకూ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను చికాకుపర్చడం, భూమిపై ధృవజ్యోతులను (అరోరాస్‌) సృష్టించడం మాత్రమే చేశాయి. అయితే.. బలమైన సౌర తుఫానులు భూమి అయస్కాంత శక్తి ( magnetic field )ని నాశనం చేయగలిగినంత శక్తిమంతమైనవని, విస్తృత స్థాయిలో సాంకేతిక వ్యవస్థలను ఆటంకపర్చేవని చెబుతున్నారు. ఇటువంటి సౌరతుఫానులను ఎక్‌స్ట్రీమ్‌ సోలార్‌ పార్టికిల్‌ ఈవెంట్స్‌ (Extreme Solar Particle Events (ESPEs), అని పిలుస్తారు. గడిచిన 12వేల సంవత్సరాలలో ఇలాంటివి ఎనిమిది సందర్భాల్లో మాత్రమే చోటుచేసుకున్నాయి. అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాను 775 CE (Common Era)లో వచ్చింది. ఈ యుగానికి ముందు వచ్చిన ఒక ఈఎస్‌పీఈ.. 775 CE లో వచ్చిన దానితో పోల్చితే 18 శాతం బలమైనదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇది 12350 BCE జనవరి, ఏప్రిల్‌ నెలల మధ్యలో వచ్చి ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంటున్నది.

“ఆధునిక ఉపగ్రహ యుగంలో అతిపెద్ద సంఘటన అయిన 2005 కణ తుఫాను (particle storm)తో పోలిస్తే, 12,350 BCE నాటి పురాతన సౌర తుఫాను. మా అంచనాల ప్రకారం 500 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంది” అని ఫిన్లాండ్‌లోని ఔలు విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకురాలు క్సేనియా గోలుబెంకో ఒక ప్రకటనలో తెలిపారు. యూరప్‌లోని ఒక చెట్టులో నిక్షిప్తమైన వంశావళి డాటా ఆధారంగా ఈ వివరాలను కనుగొన్నారు. సౌర తుఫానుల సందర్భంగా వాతావరణంలో పెరిగే రేడియోకార్బన్‌ను చెట్ల మానులకు ఉండే వృత్తాలు గ్రహిస్తాయన్న విషయం తెలిసిందే. SOCOL:14C-Ex అనే మోడల్‌ను సృష్టించిన పరిశోధకులు.. నైరుతి ఐరోపాలోని ఒక చెట్టులో నిక్షిప్తమైన రేడియోకార్బన్‌ డాటా ఉపయోగించారు.

గత కొన్నేళ్లుగా సౌర తుఫానులు సర్వసాధారణంగా మారిపోయాయి. సూర్యుడు అత్యంత తీవ్రస్థాయిలో చురుకుగా మారే దశలోకి వెళ్లడం వల్లే ఈ సౌర తుఫానులు (సాధారణంగా చెప్పాలంటే అత్యంత తీవ్రమైన వడగాడ్పులు) వస్తున్నాయని చెబుతున్నారు. ఈ వారంలో మే 14వ తేదీన (మే 14, 2025)న సూర్యుడి నుంచి ఎక్స్‌ క్లాస్‌ మంటలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన వాటిలో ఇవే శక్తిమంతమైనవని భావిస్తున్నారు. సూర్యుని సన్‌స్పాట్‌ నెమ్మదిగా భూమి వైపు తిరుగుతున్నప్పటికీ, భూ అయస్కాంత తుఫాను దిగంతంలో (ఆకాశంలో మన కంటికి కనిపించేంత దూరం) లేదు. అయితే.. 12,350 BCE సౌర తుఫానుకు మించిన సౌర తుఫాను మన జీవితకాలాల్లో వచ్చే అవకాశం లేనందున ప్రజలు భయపడాల్సిందేమీ లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Dogs Vs Leopard | చిరుత పులిని త‌రిమికొట్టిన గ్రామ సింహాలు.. వీధి కుక్క‌ల తెగువ‌పై ప్ర‌సంశ‌ల జ‌ల్లు
Srisailam Dam | డేంజర్‌లో శ్రీశైలం డ్యామ్‌?
Revanth Reddy Govt | పథకాల అమలులో జాప్యమే కాంగ్రెస్‌ సర్కార్‌కు డేంజర్‌ బెల్?
Kavya Thapar | కావ్య థాపర్ బికినీ పిక్స్.. థాయిలాండ్ వెకేషన్ లో చిల్ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ
Ashwini Sree | భారీ అందాలతో స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతున్న అశ్విని శ్రీ