సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత
విధాత : మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత( BRS Jadcherla Municipal Council Koneti Pushpalatha) కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పుష్పలతతో పాటు కౌన్సిలర్లు చావా నాగరాజు లలిత (బీజేపీ) ,గుండా ఉమాదేవి (బీఆర్ ఎస్) కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram