నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ

నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నలతో వాగ్వివాదం చెలరేగింది. సభలో రాజకీయ రచ్చ నెలకొంది.

విధాత : మెదక్ నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంటక స్వామి కార్యక్రమంలో తీవ్ర రభసా చోటుచేసుకుంది. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా..మహిళలకు నెలకు రూ.2500 ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రి వివేక్ ను ప్రశ్నించారు. మంత్రి వివేక్ స్పందిస్తూ… మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆర్టీసీ సమ్మె కూడా ఆయన పుణ్యమే అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి బదులిచ్చారు. మంత్రి వివేక్ మాటల పట్ల సునీతా లక్ష్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పేరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారని మంత్రిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వేదికపైనే వాగ్వివాదం చోటుచేసుకోగా…జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా ఎవరూ కూడా తగ్గలేదు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డిల మధ్య వాగ్వివాదంతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించాయి. ఇరు పార్టీల నాయకులను కంట్రోల్ చేయలేక పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి :

కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు
కవిత టీఆర్ఎస్ పార్టీని ఈసీ అనుమతించదు: బీఆర్ఎస్ నేత పటోళ్ల

Latest News