Adluri Lakshman| మంత్రి వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : మంత్రి అడ్లూరి

నిజామాబాద్ మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి నాపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే పార్టీపరంగా పార్టీలో కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేదని..ఇలాంటివన్ని కూడా మీడియా ముందు మాట్లాడటం బాధకరం అన్నారు.

Adluri Lakshman| మంత్రి వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : మంత్రి అడ్లూరి

విధాత : నిజామాబాద్ మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy)నాపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Ministe Adluri Lakshman )స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేక్ వ్యాఖ్యలు బాధకరం అని వ్యాఖ్యానించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నేనున్నానని..ఆరోజు నేను వెంకటస్వామి ఇన్విటేషన్ పత్రంలో నాపేరు విషయం నేను ఎక్కడా మాట్లాడలేదని..ఆరోజు ధర్మపురిలో వెంకటస్వామి జయంతిని చేసుకుని హైదరాబాద్ బయలుదేరానని..అది వివేక్ కు తెల్వదన్నారు.

ఇన్విటేషన్ పత్రంలో నాపేరు గురించి నేను ఎప్పుడు తాపత్రాయం పడేవాడిని కాదన్నారు. ప్రజల దయ, ఆశీర్వాదం ఉందన్నారు. రాహుల్, ఖర్గే, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిపించాలో ఆలోచిస్తు ముందుకెలుతున్నమన్నారు. ఏదైనా ఉంటే పార్టీపరంగా పార్టీలో కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేదని..ఇలాంటివన్ని కూడా మీడియా ముందు మాట్లాడటం బాధకరం అన్నారు.