• Telugu News
  • /Politics

జనసేనకు గాజు గ్లాసు గుర్తు శాశ్వతం.. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ

పవన్‌ కల్యాణ్‌ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది.

Reported by: Subbu | రాజకీయాలు | Jun 04, 2024, 4:13 pm IST
Read Time: 2 mins
జనసేనకు గాజు గ్లాసు గుర్తు శాశ్వతం.. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ

విధాత, హైదరాబాద్‌ : పవన్‌ కల్యాణ్‌ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 21స్థానాల్లో పోటీ చేయగా, అన్నింటా విజయం సాధించారు. అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో సాధించిన విజయాలు, ఓట్ల శాతం మేరకు ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. ఈ ఎన్నికల్లో 175స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ 12సీట్ల వద్దనే ఆగిపోగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. బీజేపీ 8స్థానాలు గెలిచింది.