కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
కేసీఆర్ ప్రజలనే తప్పుబట్టారని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎప్పటికీ మారదని, త్వరలో కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తామని ప్రకటించారు.
విధాత, హైదరాబాద్ : జగిత్యాల బీఆర్ఎస్ సభలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుబట్టే రీతిలో మాట్లాడిన మాటలు చూస్తే..ఆ పార్టీ వెయ్యేళ్లయినా తన ధోరణి మార్చుకోదని అర్ధమైపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మా ఓటమికి మీరే కారణం..మమ్మల్ని ఓడించి తప్పు చేశారని కేసీఆర్ ప్రజలను తప్పుబట్టడం కరెక్ట్ కాదు అని కవిత స్పష్టం చేశారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోకుండా కేవలం స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ పనిచేస్తోంది అన్నారు. జీవన్ రెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను పార్టీలోకి తీసుకొని తెలంగాణ పునర్ నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్పిన తీరు చేస్తుంటే ఆ పార్టీ ఎన్నటికి మారదని తేలిపోతుందని కవిత మండిపడ్డారు.
జగిత్యాల సభల జీవన్‌రెడ్డిని ఉద్దేశించి ‘‘మీకు 25 ఏళ్లు తగ్గిపోయాయి.. 50 ఏళ్ల వ్యక్తిలా పని చేయండి’’ అన్న కేసీఆర్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని, 75 ఏళ్లు వచ్చిన వ్యక్తి యువకుడైతే.. రాష్ట్రంలోని యువకులందరూ ఏమవ్వాలి. వాళ్లందరూ చచ్చిపోయారా? అని కవిత ప్రశ్నించారు. మేము పెట్టబోయే పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో కొత్త శక్తిగా మా పార్టీ ఆవిర్బావ సభ ఈ నెల 25న జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగే మా కొత్త పార్టీ ఆవిర్భావ సభకు బీసీ మహిళలు, యువత, బీసిబిడ్డలందరు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాం.
రాష్ట్రంలో మక్కలు, ధాన్యం కొనుగోలు సమస్యలతో రైతులు, అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ లు బహిరంగ సభలు పెట్టుకోవడం విడ్డూరం అని విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం, మహిళా బిల్లుపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కవిత తప్పుబట్టారు. గుంటనక్క హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై గుంపు మేస్త్రీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనతో డీల్ చేసుకున్నట్లుగా ఉందన్నారు. కోర్టులను మేనేజ్ చేసేందుకు కేంద్రం పెద్దలను కలిసేందుకే హరీశ్ ఢిల్లీ వెళ్లారంటూ సీఎం స్థాయి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలపై అపనమ్మకం కల్గించేలా మాట్లాడటం విస్మయం కల్గిస్తుందన్నారు.
మేం మళ్లా వస్తామని కేసీఆర్, మళ్లీ మేమే వస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని కవిత స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఈ సందర్బంగా కవిత స్పష్టం చేశారు. విద్యుత్తు ఆర్టీజన్స్ సమ్మెను అణిచివేసినట్లుగా ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె పట్ల వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్నారు.
ఇవి కూడా చదవండి :
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram