Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ సంచలన నిర్ణయం?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ సంచలన నిర్ణయం?

Kaleshwaram Project | విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని..ఇందులో భాగంగా ఈ వివాదంపై సుప్రీంకోర్టుకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం కేటీఆర్, హరీశ్ రావు, వినోద్, సహా పార్టీ ముఖ్యులతో..న్యాయనిపుణులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారని గులాబీ వర్గాల కథనం.

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను వివిధ కోణాల్లో విశ్లేషించి..సుధీర్ఘ తర్జన భర్జనల పిదప ఈ వ్యవహారంలో న్యాయపోరాటానికి నిర్ణయించినట్లుగా టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కూలిందనే అసత్య ప్రచారాలు చేయకుండా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేయనున్నట్లుగా సమాచారం.