Andhra Liquor Case: రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి

Andhra Liquor Case: రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి

ఖైదీ నెంబర్ 4196
ఆగస్టు 1వరకు రిమాండ్

Andhra Liquor Case | ఆంధ్రప్రదేశ్ : లిక్కర్ స్కాంలో(Liquor Scam) అరెస్టైన వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి(YSRCP MP Mithun Reddy) జైలులో 4196 నెంబర్ కేటాయించారు. ఈ కేసులో ఆయనకు కోర్డు ఆగస్టు 1వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జూలై 20 రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో స్నేహాబ్లాక్ లో ఆయనకు గదిని కేటాయించారు. జూలై 19న సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. ఎనిమిది గంటల పాటు ఆయనను విచారించారు. విచారణకు సహకరించడం లేదని సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

మిథున్ రెడ్డిపై(Mithun Reddy) తప్పుడు కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తోంది. జగన్ కు సన్నిహితుడిగా ఉన్నందునే మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ కొట్టిపారేస్తోంది. లిక్కర్ స్కాంకు(Liquor Scam) సంబంధించి ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ఆధారంగా మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసినట్టుగా ఏపీ హోంశాఖ మంత్రి వి. అనిత ప్రకటించారు.