వైద్యరంగంలో ఎలాన్ మస్క్ సరికొత్త విప్లవం..’బ్లైండ్‌సైట్’ డివైస్‌!

న్యూరాలింక్ సంస్థ ద్వారా ఎలాన్ మస్క్ 'బ్లైండ్‌సైట్' విజన్ డివైస్‌ను ప్రకటించారు. ఈ సాంకేతికతతో పుట్టుకతో అంధులైన వారికి కూడా భవిష్యత్‌లో చూపు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

కొత్త కొత్త టెక్నాలాజీతో ప్రపంచాన్ని సరికొత్త ప్రయాణం వైపు నడిపిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరో కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికాడు. ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తుంది. అయితే ట్రెండ్‌కు భిన్నంగా ఉండే స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్ సరికొత్తగా వైద్య రంగంలో సాంకేతికపై ఫోకస్ పెట్టాడు. మానవ మెదడును కంట్రోల్ చేసే బ్రెయిన్ చిప్‌సెట్‌ న్యూరాలింక్ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నట్లు గతంలో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై విస్తృత స్థాయిలో పరిశోధనల నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ తన న్యూరాలింక్(Neuralink) సంస్థ ద్వారా అంధులకు చూపు తెప్పించే ‘బ్లైండ్‌సైట్’ (Blindsight) డివైస్‌పై తాజాగా కీలక ప్రకటన చేశారు.

రానున్న 6 నుంచి 12 నెలల్లో మొదటి విజన్ డివైస్‌(Vision Device)ను విడుదల చేస్తామని తెలిపారు. పుట్టుకతోనే 100శాతం అంధులైన వారు సైతం దీని ద్వారా చూడగలరని ఆయన పేర్కొన్నారు. బ్లైండ్‌సైట్ అనేది మెదడులోని విజువల్ కార్టెక్స్‌లో అమర్చే మైక్రోఎలక్ట్రోడ్ చిప్. ఇది కెమెరా నుంచి డేటాను తీసుకోవడం ద్వారా న్యూరాన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది అంధులు తమ చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. దెబ్బతిన్న కంటి నరాలను దాటి నేరుగా మెదడులోని విజువల్ కార్టెర్టెక్స్‌కు విజన్ డివైస్ సిగ్నల్స్ పంపుతుంది. పుట్టుకతోనే అంధులైన లేదా ఆప్టిక్ నరాల దెబ్బతినడం వల్ల పూర్తిగా దృష్టి కోల్పోయిన వ్యక్తులకు దృష్టిని పునరుద్ధరించడం ఈ సాంకేతికత లక్ష్యం. భవిష్యత్‌లో ఇన్ఫ్రారెడ్, అల్ట్రావయోలెట్ తరంగాలతో పాటు సూపర్ హ్యూమన్ కంటి చూపును అందించే అవకాశం ఉందని మస్క్ వెల్లడించారు.

Latest News