Microsoft crash | ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద సంక్షోభం.. విండోస్ క్రాష్‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ట్వీట్
Microsoft crash | మైక్రోసాఫ్ట్ (Microsoft) విండోస్ క్రాష్‌పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల (Satya Nadella) ఎక్స్ వేదికగా స్పందించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అయ్యింది. సాయంత్రం వరకు కూడా మైక్రోసాప్ట్ విండోస్ పని చేయలేదు. దాంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బందుల్లో పడ్డారు.
Microsoft crash : మైక్రోసాఫ్ట్ (Microsoft) విండోస్ క్రాష్‌పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల (Satya Nadella) ఎక్స్ వేదికగా స్పందించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అయ్యింది. సాయంత్రం వరకు కూడా మైక్రోసాప్ట్ విండోస్ పని చేయలేదు. దాంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బందుల్లో పడ్డారు.
ప్రపంచంలో విండోస్, లైనక్స్, యాపిల్ ఇలా కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది వాడేది మైక్రోసాఫ్ట్ విండోసే. శుక్రవారం ఇది క్రాష్ కావడంతో ప్రపంచం స్తంభించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ల్యాప్‌టాప్‌లు, పీసీలూ పనిచేయలేదు. వాటి స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ ఎర్రర్ దర్శనమిచ్చింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా సిస్టం రీబూట్ అయ్యింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సాయంత్రం సమస్యను పరిష్కరించడంతో పరిస్థితి చక్కబడింది.
అయితే మైక్రోసాఫ్ట్ అవుటేజ్‌పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతి పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. శుక్రవారం క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్ డేట్ కారణంగా వరల్డ్ వైడ్‌గా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందని చెప్పారు. సమస్యను గుర్తించి దానికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి భవిష్యత్తులో సమస్య రాకండా చూసేందుకు శ్రమిస్తున్నామని చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram