Redmi A7 Pro | వెట్ టచ్ సపోర్టుతో రెడ్‌మీ నుంచి సరికొత్త మొబైల్.. ధర, ఫీచర్లు ఏంటంటే..!

Redmi A7 Pro | షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ బడ్జెట్ కేటగిరీలో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే లక్ష్యంతో వచ్చిన ఈ ఫోన్.. 120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Redmi A7 Pro | షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ బడ్జెట్ కేటగిరీలో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే లక్ష్యంతో వచ్చిన ఈ ఫోన్.. 120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. చవకైన ధరలో కీలక ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

ధర ఎంత ఉండొచ్చంటే..

Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర EUR 129.99 (సుమారు రూ.14,100), 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర EUR 149.99(సుమారు రూ.16,300)గా నిర్ణయించారు. ఈ మొబైల్ బ్లాక్(Black), మిస్ట్ బ్లూ(Mist Blue), పామ్ గ్రీన్(Palm Green), సన్‌సెట్ ఆరెంజ్(Sunset Orange) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+IPS LCD డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేటుతో పాటు 800 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టు చేస్తుంది. డీసీ డిమ్మింగ్, టీయూవీ రైన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఇందులో వెట్ టచ్ సపోర్టు వంటి ఫీచర్ కూడా ఉంది. అంటే తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.

ప్రాసెసర్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4GB LPDDR4X ర్యామ్‌తో పాటు గరిష్టంగా 128GB UFS 2.2స్టోరేజ్‌‌ను అందిస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3పై పనిచేస్తుంది. అలాగే గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కెమెరా సెటప్

ఈ మొబైల్‌ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/2.2 అపెర్చర్‌తో కూడిన 13 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితోపాటు మరో సెన్సర్ కూడా ఉంది. అయితే దీని వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

బ్యాటరీ

బ్యాటరీ విషయంలోనూ ఈ ఫోన్ ఆకర్షిస్తోంది. ఇందులో 6000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 15W చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీపరంగా ఇందులో డ్యూయల్ 4G VoLTE, Wifi, Bluetooth 5.2, GPS, NFC, USB Type C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Read More:

9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. మిడ్ రేంజ్ మొబైల్స్‌లో సంచలనం!

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!

Latest News