Redmi Note 15SE 5G | 20 వేలలోపే రెడ్‌‌మీ నోట్ 15 SE 5జీ.. స్లిమ్ డిజైన్, లైట్‌ వెయిట్‌తో స్పెషల్ ఎడిషన్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్‌లో తన కొత్త మిడ్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ Redmi Note 15 SE 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటీవల విడుదలైన రెడ్‌మీ నోట్ 15 సిరీస్‌లో స్పెషల్ ఎడిషన్‌గా దీన్ని తీసుకొచ్చింది.

Redmi Note 15SE 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్‌లో తన కొత్త మిడ్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ Redmi Note 15 SE 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటీవల విడుదలైన రెడ్‌మీ నోట్ 15 సిరీస్‌లో స్పెషల్ ఎడిషన్‌గా దీన్ని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తూ కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు రెడ్‌మీ కంపెనీ ఈ ఫోన్‌ను రూపొందించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షావోమీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,999గా.. 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా ఖరారు చేసింది. ప్రారంభ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ.2వేలు తక్షణ రాయితీ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా రూ.4వేల విలువైన స్పెషల్ ప్రారంభ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

వేగన్ లెదర్ ఫినిష్.. మూడు కలర్ ఆప్షన్లతో!

ఈ Redmi Note 15SE స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఫ్రాస్టెడ్ వైట్, కార్బన్ బ్లాక్, క్రిమ్సన్ రిజర్వ్(ఎరుపు) రంగుల్లో లభిస్తుంది. ముఖ్యంగా క్రిమ్స్ రిసర్వ్ వేరియంట్ వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిష్‌తో ప్రత్యేక ఆకర్షణ‌గా నిలుస్తోంది. ఇది స్లిమ్ అండ్ లైట్‌‌వెయిట్‌గా ఉండటం మరో ప్రత్యేకత. ఈ ఫోన్ కేవలం 178 గ్రాముల బరువు, 7.35 మిల్లీమీటర్ల సన్నటి బాడీతో వస్తుంది.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.77 అంగుళాల FHD+ Curved AMOLED డిస్‌ప్లేను ఇందులో అందించారు. 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్, 12 బిట్ కలర్ డెప్త్ వంటి ఫీచర్ల ద్వారా మెరుగైన విజువల్ అనుభవం లభించనుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో పనితీరు కోసం Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

కెమెరా సెటప్

రెడ్‌మీ నోట్ 15 SE 5జీ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు.. అదనంగా 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ అమర్చారు. అయితే గత మోడల్‌తో పోలిస్తే అల్ట్రావైడ్ కెమెరా లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ఫాస్ట్ చార్జింగ్.. భారీ బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 5800mAh సామర్థ్యంతో వస్తుంది. దీంతో ఒకరోజు అంతకంటే ఎక్కువే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS2పై ఈ ఫోన్ పనిచేస్తుంది. IP65/IP66 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది. అలాగే Dolby Atmos సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే రూ.20వేల లోపు ధరలో స్లిమ్ డిజైన్, పెద్ద బ్యాటరీ కోరుకునే కస్టమర్లకు ఇది మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Read More:

వెట్ టచ్ సపోర్టుతో రెడ్‌మీ నుంచి సరికొత్త మొబైల్.. ధర, ఫీచర్లు ఏంటంటే..!

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!

డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ స్మార్ట్‌ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు!

Latest News